For Money

Business News

లాభాల్లో ట్రేడవుతున్న క్రిప్టో కరెన్సీలు

ప్రధాన క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ అమెరికా మార్కెట్‌లో1.85 శాతం లాభంతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 48,842 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథీరియం కూడా ఒక శాతంపైగా లాభంతో 4,064 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బినాన్స కాయిన్‌తోపాటు సొలానా నష్టాల్లో ఉన్నాయి. టిథెర్ స్థిరంగా ఉంది.
మన మార్కెట్‌లో…
భారత మార్కెట్‌లో బిట్‌ కాయిన్‌ కేవలం 0.65 శాతం లాభంతో రూ. 39,12,440 వద్ద ట్రేడువతోంది. గత 24 గంటల్లో బిట్‌ కాయిన్ 0.65 శాతం లాభంతో ఉంది. డాలర్‌ బలహీనంగా ఉండటం వల్ల బిట్‌ కాయిన్‌ లాభ శాతం తక్కువగా ఉంది. అలాగే ఎథెర్‌ స్వల్ప నష్టంతో రూ. 3,27,346 వద్ద ఉండగా, బీఏటీ, పాలిగాన్‌లో పెద్ద మార్పు లేదు. అయితే లైట్‌ కాయిన్‌ 5 శాతం, EOS 10 శాతం లాభంతో ట్రేడవుతోంది. బిట్‌ కాయిన్‌ క్యాష్‌ టెథర్‌ స్వల్ప నష్టంతో ట్రేడవుతున్నాయి.