బర్గర్ కింగ్ మళ్ళీ నిధుల సమీకరణ?
కంపెనీ విస్తరణ కోసం మళ్ళీ నిధుల వేటలో పడింది బర్గర్ కింగ్. మరోసారి పబ్లిక్ లేదా ప్రైవేట్ ఆఫర్ ద్వారా నిధులు సమీకరించాలా లేదా నిబంధనల మేరకు ఇతర మార్గాల నుంచి నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించేందుకు ఈనెల 15వ తేదీన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. ఏటా 70 కొత్త రెస్టారెంట్లు చొప్పున కంపెనీని విస్తరించాలని బర్గర్ కింగ్ భావిస్తోంది. 2026 చివరికల్లలా మొత్తం రెస్టారెంట్ల సంఖ్య 700లను దాటాలని కంపెనీ టార్గెట్గా పెట్టుకుంది.