NIFTY TODAY: పెరిగితే అమ్మండి
అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లతో పోలిస్తే ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇవాళ్టి డే ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 17,516. నిఫ్టి ఒకవేళ గ్రీన్‌లో ప్రారంభమైతే.. వెంటనే 17,560-17,580 ప్రాంతంలోనే ఒత్తిడి రానుంది. స్టాప్‌లాస్ 17,600. ఇవాళ్టికైతే ఈ స్థాయికి వస్తుందా అన్నది అనుమానమే. దాటితే అమ్మొద్దు. ఇక నిఫ్టి గనుక నష్టాల్లో ప్రారంభమైతే… నిఫ్టి 17,480 వద్ద నిలబడుతుందేమో చూడండి. కాస్సేపు ఆగండి. ఎందుకంటే ఈ స్థాయి దిగువకు నిఫ్టి వస్తే 17,450 వరకు చేరొచ్చు. టెక్నికల్‌గా ఇది మార్కెట్‌కు తొలి మద్దతు. ఈ స్థాయి కోల్పోతే 17,435 వద్ద మద్దతు అందొచ్చు. రిస్క్ తీసుకునే వారు స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. 17400 దిగువకు వెళితే నిఫ్టికి ఇబ్బందులు తప్పవు.