17,500పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలో కాకున్నా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయి 17,543ని తాకింది. వెంటనే 17,515 ని తాకిన వెంటనే ఇపుడు 17,352 ప్రాంతంలో ట్రేడవుతోంది. నిన్న భారీగా పెరిగిన మెటల్స్, బ్యాంకు షేర్లు ఇవాళ కాస్త డల్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 36 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో ఇవాళ లాభాల స్వీకరణకు ఆస్కారం ఉంది. నిఫ్టి ఇవాళ 17,400ని తాకుతుందా అనేది చూడాలి. ఛాన్స్ అధికంగా ఉంది. మెటల్స్‌లో వేదాంత ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. క్రమంగా ఇన్వెస్టర్ల దృష్టి బీఎస్ఈ షేర్‌పై పడుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్ఎస్ఈ లిస్ట్ అయ్యే అవకాశముంది. దీంతో బీఎస్ఈ షేర్ కాస్త యాక్టివ్ అయ్యే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టిలో ఇవాళ లాభాల స్వీకరణ రావొచ్చు. మిడ్‌సెషన్ తరవాత నిఫ్టిలో అసలు యాక్షన్‌కు ఛాన్స్ ఉంది.