For Money

Business News

NIFTY TRADE: ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు

స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో దూసుకుపోతున్నా.. క్యాష్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు రూ. 579 కోట్ల నికర అమ్మకాలు చేయగా, దేశీయ ఆర్థిక సంస్థలు రూ. 17935 కోట్ల కొనుగోళ్ళు చేశాయి. అయితే డెరివేటివ్స్‌లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు చాలా చురుగ్గా ఉన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నిన్న రూ. 7000 కోట్లకుపైగా నికర అమ్మకాలు చేశారు. ఆప్షన్స్‌లో రూ. 7824 కోట్ల అమ్మకాలు చేసినట్లు డేటా చెబుతోంది. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌, స్టాక్‌ ఫ్యూచర్స్‌లో వీరి ట్రేడింగ్‌ చాలా తక్కువ. వీరేందర్‌ కుమార్‌ అంచనా ప్రకారం నిఫ్టికి తొలి ప్రతిఘటన 17496 లేదా 17522 ప్రాంతంలో రానుంది. ఈ స్థాయిలను దాటితే 17571 కూడా చేరొచ్చు. పడితే 17396 వద్ద, తరవాత 17350 వద్ద మద్దతు ఉందని అంటున్నారు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడండి.