NIFTY TODAY: 17114 లక్ష్మణ రేఖ
భారీ లాభాలతో నిఫ్టి నిన్న 17,176 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే 17250ని నిఫ్టి ఓపెనింగ్‌లోనే దాటనుంది. నిఫ్టి 17114 పైన ఉన్నంత వరకు ఢోకా లేదు. దీనిపై నిలబడి పటిష్ఠంగా ముందుకు సాగితే 17275ను దాటే అవకాశముంది. షార్ట్ చేయాల్సిన వారుఉ 17325 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని షార్ట్ చేయొచ్చు. ఆర్బీఐ పాలసీ 10 గంటలకే రానుంది. రిస్క్ వొద్దనుకునేవారు అప్పటి దాకా ఆగొచ్చు. ఆర్బీఐ నుంచి కీలక నిర్ణయాలు ఉండవని అంచనా. అదే జరిగితే నిఫ్టి 17250-17300 మధ్య ఒత్తిడి రావొచ్చు. ఇందాక అన్నట్లు 17114 దిగువకు వస్తే మాత్రం నిఫ్టికి తొలి మద్దతు 17065 వద్ద అందనుంది. తరవాత 17,030. రాత్రి భారీగా పెరిగిన తరవాత కూడా అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్‌లో భారీ పతనం అనుమానమే. కాకపోతే అధిక స్థాయిలో నిఫ్టి నిలబడుతుందా? ఎందుకంటే నిన్నటి మార్కెట్ భారీగా పెరిగినా… విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ కంటే అమ్మకాలే అధికంగా ఉన్నాయి.