కమర్షియల్ వెహికల్స్ ధరలు పెంపు
టాటా మోటార్స్ కమర్షియల్ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ఈ వాహనాల ధరలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముడి సరకు ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. మీడియం, హెవీ, ఇంటర్మీడియట్, లైట్, స్మాల్ కమర్షియల్ వెహిల్స్తో పాటు బస్సుల ధరలను కూడా పెంచబోతున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ పేర్కొంది. స్టీల్, అల్యూమినియం, ఇతర లోహాల ధరలు పెరగడంతో కమర్షియల్ వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా, మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు వచ్చే నెల నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.