నాస్డాక్ నుంచి దిది డీలిస్టింగ్!
చైనాకు చెందిన ప్రముఖ రైడింగ్ యాప్ దిది తన షేర్లను న్యూయార్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ (నాస్డాక్) నుంచి డీలిస్ట్ చేయాలని నిర్ణయించింది. యూబర్ వంటి రైడింగ్ యాప్ అయిన దిదికి గట్టి మార్కెట్ షేర్ ఉంది. గత కొన్ని రోజుల నుంచి చైనా అధికారులు ఈ కంపెనీ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. చైనా నుంచి ఒత్తిడి అధికంగా కావడంతో నాస్డాక్ నుంచి తన షేర్లను డిలిస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. నాస్డాక్ బదలు కంపెనీ షేర్లు హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టవుతాయని పేర్కొంది.