NIFTY TRADE: FIIలు అమ్ముతున్నారు
నిన్న నిఫ్టి దాదాపు 300 పాయింట్లు పెరిగినా… విదేశీ ఇన్వెస్టర్లు నగదు మార్కెట్లో షేర్లను అమ్ముతూనే ఉన్నారు. నిన్న వీరు రూ. 910 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1373 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు తగ్గిన మాట నిజమే. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో మాత్రం కొనుగోళ్ళు బాగున్నాయి. నిన్న ఈ సిగ్మెంట్లో రూ. 2,863 కోట్ల డీల్స్ కుదుర్చుకున్నారు. ఇందులోనూ రూ.2,606 కోట్లు ఆప్షన్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో.. క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లకు బదులు… పూర్తిగా గ్యాంబ్లింగ్ సెగ్మెంట్లో యాక్టివ్‌గా ఉన్నారన్నమాట. వీరేందర్ అంచనా మేరకు పెరిగితే 17466 లేదా 17510 వద్ద నిఫ్టికి ప్రతిఘటన రానుంది. మద్దతు 17340 లేదా 17305 ప్రాంతంలో లభించవచ్చు. ఇతర లెవల్స్‌కు వీడియో చూడండి.