నెలలో రూ. లక్ష కోట్లు దాటింది
దేశంలో క్రెడిట్‌కార్డు వినియోగం బాగా పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా క్రెడిట్ కార్డుల ద్వారా నెలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో క్రెడిట్‌కార్డుల వినియోగం 25 శాతం పెరిగిందని, ఆ నెలలో వీటి ద్వారా జనం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపింది. గత ఏడాది ఇదే అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా జనం రూ. 64,891 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.ఇక ఈ ఏడాది విషయానికిస్తే ఆగస్టులో రూ. 77,981 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 80,477 కోట్లు ఖర్చు పెట్టారు. అక్టోబర్‌లో ప్రధాన పండుగలు రావడంతో ప్రజలు భారీ ఖర్చు పెట్టినట్లు భావిస్తున్నారు.