నాలుగు అమెరికా రాష్ట్రాల్లో ఒమైక్రాన్
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో 9 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా, కొలరాడొ, మిన్నెసొటాలతో పాటు తాజాగా న్యూయార్క్లో ఒమైక్రాన్ బయటపడింది. న్యూయార్క్లో ఏకంగా అయిదు కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొందరు పూర్తి వ్యాక్సినేషన్ తీసుకున్నవారు కూడా ఉన్నారు. దేశంలో మరిన్ని ఒమైక్రాన్ కేసులు బయట పడే అవకాశముందని, ప్రజలు భయంతో కాకుండా జాగ్రత్తతో మెలగాలని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ లీనా వేన్ అన్నారు. అమెరికా దేశ జనాభాలో 60 శాతం మంది అంటే దాదాపు 19.6 కోట్ల మంది పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ధనిక దేశాల్లో అతి తక్కవ శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నది అమెరికాలోనే.