17,200 దాటిన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఏకంగా 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ 17104 వద్ద ప్రారంభమైన నిఫ్టి వెంటనే 17079ని తాకింది. ఆ వెంటనే కోలుకుని పావు గంటలోనే 17,200ను దాటింది. ప్రస్తుతం 201 పాయింట్ల లాభంతో 17,184 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో కేవలం మూడు షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. 47 షేర్లు గ్రీన్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి 1.4 శాతం లాభంతో నిఫ్టికి అండగా నిలిచింది. ఇక మిడ్ క్యాప్ సూచీ ఒక శాతం కూడా పెరగలేదు. అలాగే నిఫ్టి నెక్ట్స్ కూడా 0.5 శాతం లాభానికే పరిమమైంది. అంటే కేవలం ర్యాలీ నిఫ్టి షేర్లకే పరిమితమైంది. మిగిలిన షేర్లలో పెద్ద హడావుడి లేదు. నిఫ్టి రెండో ప్రధాన ప్రతిగటన స్థాయి వద్ద ట్రేడవుతోంది. మరి మిడ్ సెషన్ వరకు ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే రాత్రి రెండు శాతంపైగా పెరిగిన అమెరికా మార్కెట్లు ఇపుడు స్వల్పంగా మాత్రమే కోలుకున్నాయి. పైగా ఒమైక్రాన్ కేసులో యూరప్ అధికంగా ఉన్నాయి. కాబట్టి మన ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది.