మళ్ళీ నష్టాల బాటలో వాల్‌స్ట్రీట్
డెల్టాని తట్టుకునే వ్యాక్సిన్లను తప్పించుకుంటున్న ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ప్రమాదముందని మోడెర్నా కంపెనీ సీఈఓ చేసిన హెచ్చరికతో ఇవాళ మధ్యాహ్నం నుంచే ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టాయి. కొద్ది సేపటి క్రితం ప్రారంభమైన వాల్ స్ట్రీట్‌లోని ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. మూడు సూచీలూ 1.5 శాతం మేర నష్టాల్లో ట్రేడవడం విశేషం. డాలర్ స్వల్పంగా పెరగ్గా, క్రూడ్ మళ్ళీ నష్టాల బాట పట్టింది. తాజా సమాచారం మేరకు WTI క్రూడ్ బ్యారెల్ ధర 67.25 డాలర్లు కాగా, బ్రెంట్ క్రూడ్ ధర 70.50 డాలర్లుగా ఉంది. బులియన్ రెడ్‌లో ఉన్నా నష్టాలు పెద్దగా లేవు.