కోలుకున్న వాల్‌స్ట్రీట్
ఒమైక్రాన్ భయాందోళనల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి. ఇవాళ యూరో, మార్కెట్ల తరవాత అమెరికా మార్కెట్లు కూడా కొంత మేర కోలుకున్నాయి. ముఖ్యంగా ట్విటర్ కొత్త సీఈఓ నియామం సందర్భంగా ఆ కంపెనీ షేర్ 11 శాతంపైగా పెరిగింది. ఇతర టెక్ కంపెనీల షేర్లు పెరగడంతో నాస్డాక్ ఒకటిన్నర శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 కూడా అందుకే ఒక శాతం వరకు పెరిగింది. డౌజోన్స్ మాత్రం 0.34 శాతం లాభానికే పరిమితమైంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ కూడా స్వల్పంగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఇవాళ 3 శాతం పైగా కోలుకుంది. బులియన్ స్థిరంగా ఉందనే చెప్పాలి.