ఒమైక్రాన్ షాక్‌లోనే ఆసియా మార్కెట్లు

అంతర్జాతీయ షేర్ మార్కెట్లు ఇంకా ఒమైక్రాన్ షాక్‌లోనే ఉన్నాయి. శుక్రవారంనాటి పతనంతో పోలిస్తే ఇవాళ నిలకడగా ఉన్నా.. చాలా మార్కెట్లు ఇంకా రెడ్‌లోనే ఉన్నాయి. అమెరికా శుక్రవారం రెండు శాతంపైగా నష్టంతో క్లోజ్ కాగా, యూరప్ మార్కెట్లు మూడు నుంచి నాలుగు శాతం నష్టపోయాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో పతనం ఆగింది. కాని మార్కెట్లన్నీ ఇంకా రెడ్‌లోనే ఉన్నాయి. చాలా మార్కెట్లు క్రితం స్థాయి వద్ద ఉండగా, కొన్ని గ్రీన్‌లో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో వస్తాయేమో చూడాలి. కరెన్సీ, ఆయిల్ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా స్వల్ప లాభాలతో ఉంది. మరి నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమౌతుందా అన్నది చూడాలి.