For Money

Business News

భారత్‌లో మరో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌

గత సెప్టెంబర్‌లో భారత మార్కెట్‌లోకి క్రాస్‌ టవర్‌ ప్రవేశించింది. భారత మార్కెట్‌లో ప్రవేశించిన తొలి అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ ఇది. ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీని నిషేధిస్తామని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త చట్టాన్ని కూడా తెస్తోంది. ఈ నేపథ్యంలో మరో అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ భారత మార్కెట్‌లో ప్రవేశించింది. అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ అయిన కాయిన్‌ స్టోర్‌ ఇటీవలే బెంగళూరు, న్యూ ఢిల్లీ, ముంబైలలో లోకల్‌ ఆఫీసులను ప్రారంభించింది. ఆరంభంలో వంద మంది ఉద్యోగులను తీసుకుంటున్నామని, రెండు కోట్ల డాలర్లు పబ్లిసిటీ కోసం వెచ్చిస్తున్నట్లు ఈ సింగపూర్‌ కంపెనీ వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ బిజినెస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం సానుకూల విధానాలను తెస్తుందన్న ఆశాభావాన్ని కాయిన్‌ స్టోర్‌ వ్యక్తం చేసింది.