For Money

Business News

రిలయన్స్‌కు ఆరామ్‌కో గుడ్‌బై?

సౌదీ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఆరామ్‌కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం రద్దయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది. 2019లో రిలయన్స్‌కు చెందిన ఆయిల్‌ టు కెమికల్స్‌(ఓ2సీ) విభాగంలో 1,500 కోట్ల డాలర్లకు 20 శాతం వాటా తీసుకునేందుకు ఆమోదిస్తూ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాన్ని రీ వ్యాల్యూ చేస్తున్నామని రెండు కంపెనీలు గత వారం పేర్కొన్నాయి. అయితే వ్యాల్యూయేషన్‌కు సంబంధించి రెండు కంపెనీల మధ్య అంగీకారం కుదర్లేదని… ఒప్పందం రద్దయినట్లేనని రాయిటర్స్‌ పేర్కొంది. దీంతో రెండు సంవత్సరాల నుంచి కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలకు గుడ్‌బై చెప్పినట్లే.