NIFTY TODAY: పడితే కొనొచ్చా?
గత ఆరు రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 16000 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. ఏ స్థాయిలోనూ మద్దతు ఇవ్వడం లేదు. ట్రేడింగ్ మొత్తం ఆప్షన్స్‌లో కేంద్రీకరించారు. దేశీయ ఇన్వెస్టర్లు ఎంత వరకు మద్దతు ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా నెలకు లక్ష కోట్ల రూపాయలకు పైనే రిడంప్షన్స్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభిస్తుందా అన్నది చూడాలి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టి క్రితం ముగింపు 17,415. నిఫ్టి ఇక్కడి నుంచి భారీ పడే అవకాశాలు తక్కువే ఉన్నా.. పడితే మద్దతు మాత్రం 17,330 వద్ద ఉంది. ఒకవేళ 17350 వద్దకు వస్తే రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు కొనుగోలు చేయొచ్చు. కాని స్టాప్‌లాస్ మాత్రం 17,305 రిస్క్‌ను బట్టి పొజిషన్ తీసుకోవచ్చు. పరిస్థితి చూస్తుంటే ఓపెనింగ్‌లో నిఫ్టి ఈ స్థాయికి రాకపోవచ్చు. ఇక పెరిగితే ఎలా ఉంటుంది. నిఫ్టి కోలుకుంటే తొలి ప్రతిఘటన 17460 ప్రాంతంలో రావొచ్చు. రెండో ప్రతిఘటన 17500. ఒకవేళ ఇక్కడికి వస్తే 17525 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. ఈ లెవల్స్‌ను బట్టి ట్రేడ్ చేయండి. కాని కొన్ని అంశాలు గుర్తు పెట్టుకోండి. ఇవాళ నవంబర్ డెరివేటివ్స్ క్లోజింగ్. నిఫ్టిలో ఒడుదుడుకులు అధికంగా ఉండొచ్చు. నిఫ్టి ఇపుడు ఓవర్ సోల్డ్ జోన్‌కు వచ్చిందని అంటున్నారు. అంటే భారీ పతనం అనుమానమే. టెక్నికల్స్ వీక్‌గా ఉన్న నిఫ్టికి దిగువస్థాయిలో మద్దతు లభించవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ వచ్చాయి. మార్కెట్లకు నెగిటివ్‌గా ఉన్నాయి. మరి ఆ మినిట్స్‌ను మార్కెట్ డిస్కౌంట్ చేసిందా?అమెరికా మార్కెట్లకు ఇవాళ సెలవు. డాలర్ బలంగా ఉంది. క్రూడ్ కూడా. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది.