నిఫ్టి: అమ్మినవాడు అదృష్టవంతుడు
డెరివేటివ్స్ క్లోజింగ్ ముందు రోజు నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి వెంటనే కోలుకుని రోజంతా లాభాల్లో ఉంది. ముఖ్యంగా మిడ్ సెషన్ తరవాత కూడా నిఫ్టి బలంగా ఉండటంతో చాలా మంది ఇన్వెస్టర్లు మోసపోయారు. చివగంటన్నరలో మొత్తం మార్కెట్ ధోరణి మారిపోయింది. 17,600 నుంచి ఏకంగా 17,354 పాయింట్లకు పడిపోయింది. అంటే 250 పాయింట్లు నష్టపోయిందన్నమాట. మార్కెట్ ముగిసే ముందు నిఫ్టి కోలుకుని 17415 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 88 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టి అరశాతం లాభపడినా… ఇతర కౌంటర్లలో వచ్చిన ఒత్తిడి నిఫ్టిని దెబ్బతీసింది. ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టితో పాటు మిడ్ క్యాప్ నిఫ్టి కూడా అర శాతంపైగా నష్టపోయింది. క్రూడ్ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది. అలాగే ఇటీవల బాగా పెరిగిన ఐషర్ మోటార్స్‌లో లాభాల స్వీకరణ జరగడంతో ఈ షేర్ టాప్ లూజర్స్‌గా నిలిచింది.