మెడ్‌ప్లస్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకు ఓకే
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఔషధాల విక్రయ సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,639 కోట్లను సమీకరించాలని మెడ్ ప్లస్ ప్రతిపాదించింది. ఇందులో ఇష్యూలో రూ.600 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరింస్తారు. మిగిలిన మొత్తాన్ని ఇపుడు కంపెనీలో ఉన్న వాటాదారులు తమ వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా అమ్ముతారు. కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ అనుబంధ సంస్థ ఆప్టివల్ నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించనున్నారు. షేర్ ధర శ్రేణితో పాటు పబ్లిక్ ఆఫర్ తేదీలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశముంది.