NIFTY TODAY: పెరిగితే అమ్మడమే
ప్రపంచ మార్కెట్లు ఇపుడు వీక్‌గా మారుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 97వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే భారీగా క్షీణించిన చైనా మార్కెట్ ఇపుడు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కన్పిస్తోంది. దాదాపు నెల రోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికి వస్తే నిఫ్టి క్రితం ముగింపు 17,416. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ ఇక్కడ కూడా కొనసాగితే నిఫ్టి 17,300-17,330 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. 17,350 దిగువన పావు గంట వరకు ఉంటే.. నిఫ్టి 17,300 స్థాయిని కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టెక్నికల్‌గా నిఫ్టికి 17,255 వద్ద తొలి మద్దతు కన్పిస్తోంది.ఈ స్థాయికి రావాలంటే నిఫ్టి ఒక శాతంపైగా నష్టపోవాలి. ఇదే జరిగితే… ఇక్కడ మద్దతు అందాలి. లేకుంటే 17,200 రెండో స్థాయి. ఇక్కడ బలహీనంగా ఉంటే… ఇవాళ కాకున్నా… మున్ముందు నిఫ్టి 17,000 స్థాయిని కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 177,00 దాటితేగాని నిఫ్టికి బుల్‌రన్ సాధ్యం కాదు. కాబట్టి… పెరిగినపుడు అమ్మడమే బెటర్. వ్యవసాయ చట్టాల రద్దు ఎఫెక్ట్‌ను మార్కెట్ డిస్కౌంట్ చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. రిలయన్స్ నిఫ్టిని బాగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.