నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో మళ్ళీ కోవిడ్ భయాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో రోజుకు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి. యూరప్‌లో కూడా పరిస్థితి మరింత దిగజారుతోంది. దీంతో ముడి చమురు ధరలు భారీగా క్షీణించాయి. అయితే డాలర్ బలపడటంతో మన మార్కెట్లకు ప్రయోజనాలు తగ్గినట్లే. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా డౌజోన్స్ 0.75 శాతం క్షీణించింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా తప్ప మిగిలిన మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీతో పాటు హాంగ్ సెంగ్ నష్టాల్లో ఉన్నాయి. ఇతర మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 80 పాయింట్లు లాభంతో ట్రేడవుతోంది. శుక్రవారం మన మార్కెట్లు పనిచేయలేదు. కాబట్టి సింగపూర్ నిఫ్టి ఒక మోస్తరు లాభాల్లో ఉంది. అయితే నిఫ్టి ఇవాళ నష్టాల్లో ప్రారంభం కావొచ్చు.