17,900కి దగ్గర్లో నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా అంటే భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17,906ని తాకి ఇపుడు 17,926 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 73 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి ఇవాళ్టికి కనిష్ఠస్థాయిని తాకిందా లేదా 17900ని బ్రేక్ చేసి దిగువకు వెళుతుందా అనేది చూడాలి. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అన్నింటి కంటే అధికంగా బ్యాంక్ నిఫ్టి 0.75 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టి 38000 స్థాయి దిగువకు వెళుతుందా అనేది చూడాలి. మిడ్ క్యాప్ సూచీ కూడా నష్టాల్లో ఉన్నా… నామ మాత్రపు నష్టాలే అని చెప్పొచ్చు. ఏషియన్ పెయింట్స్ నిఫ్టి టాప్ గెయినర్ కాగా, మిడ్ క్యాప్ టాప్ గెయినర్‌గా ఎస్కార్ట్స్ నిలిచింది. నిఫ్టిలో 28 షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం లిస్టయిన సిగాచి ఇవాళ 5 శాతం నష్టంతో ట్రేడవుతోంది.