NIFTY TODAY: విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
మార్కెట్‌కు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. క్యాష్‌త పాటు ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ. 2000 కోట్ల పైనే ఉన్నాయి. మార్కెట్ చాలా వరకు 17,900-18,100 మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయని సీఎన్‌బీసీ ఆవాజ్ పోల్‌లో అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టి పెరిగితే 18,087 వద్ద, తరవాత 18127 వద్ద ఒత్తిడి వస్తుందని వీరేందర్ కుమార్ అంటున్నారు. పడితే వెంటనే 17974 వద్ద, ఆ తరవాత 17934 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా. ప్రపంచ మార్కెట్లు భిన్నంగా స్పందిస్తున్నందున… లెవల్స్ ప్రకారం స్టాప్‌లాస్‌తో ట్రేడ్ చేయడం ఇన్వెస్టర్లు మర్చిపోరాదు. ఒడిదుడుకులు తక్కువగా ఉన్నపుడు నిఫ్టి పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా స్పందిస్తోంది.
https://www.youtube.com/watch?v=lbytxLPhPwY