For Money

Business News

NIFTY TRADE: 17,950 కీలకం

వాల్‌స్ట్రీట్‌కు భిన్నంగా ఆసియా స్టాక్‌ మార్కెట్లు స్పందిస్తున్నాయి. డాలర్‌ పెరగడం వల్ల కొన్ని కరెన్సీలకు పాజిటివ్‌ కాగా, కొన్ని ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. డాలర్‌ పెరగడం మన ఐటీ కంపెనీలకు పాజిటివ్‌ అంశమైనా… ఆ షేర్లలో భారీ అమ్మకాల ప్రభావం మన మార్కెట్‌పై ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ మన మార్కెట్‌లో రోజూ అమ్ముతుండగా, దేశీయ సంస్థలు సూచీలను కాపాడుతున్నాయి. మరి ఇదెంత వరకు అన్నది తేలాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎఫ్‌ అండ్‌ ఓలో క్రమంగా షార్ట్‌ పొజిషన్స్‌ పెరుగుతున్నాయి. సెంటిమెంట్‌, ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉన్నా..నిఫ్టికి 50 రోజుల చలన సగలు 17,757 వద్ద ఉంది. కాబట్టి నిఫ్టి ఈ నెలలో అక్కడికి వెళుతుందా అన్నది చూడాలి. 20 రోజుల చలన సగటు 18,089 దాటితే కాని నిఫ్టిలో అప్‌ట్రెండ్‌కు ఛాన్స్‌ లేదు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 18,017. నిఫ్టికి ఇవాళ 17,960 కీలకం. నిఫ్టి పడితే ఈ స్థాయిలో మద్దతు అందుతుందా అన్నది చూడండి. 17,935పైన ఉన్నంత వరకు పరవాలేదు. 17,920 దిగువకు వస్తే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. కాని ఈ స్థాయిల్లో నిఫ్టికి మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 17,935 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందితే ఈజీగా నిన్నటి ముగింపును దాటొచ్చు. మద్దతు కొనసాగే పక్షంలో నిఫ్టి 18,070 దాకా వెళ్ళొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు మాత్రం నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.