నిఫ్టి: ఓపెనింగ్‌లోనే 17,950
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 84 పాయింట్ల లాభంతో 17,973 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కేవలం మూడు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి స్వల్ప లాభంతో ఉన్నా… నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లు మాత్రం నిఫ్టి స్థాయిలోనే 0.45 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా భారతీ ఎయిర్‌టెల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్ క్యాప్ విభాగంలో టాటా గ్రూప్ కంపెనీ ట్రెంట్ 6 శాతంపైగా లాభంతో ఉంది. మరి నిఫ్టి 17970పైన ఎంత వరకు వెళుతుందో చూడాలి. 18,000 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మడమే బెటర్ అని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. రేపు దీపావళి ప్రత్యేక ట్రేడింగ్ మాత్రమే ఉంటుంది. రేపు, ఎల్లుండి మార్కెట్లకు సెలవు. అంటే మళ్ళీ సాధారణ ట్రేడింగ్ సోమవారమే.