For Money

Business News

నైకా ఐపీఓకు అనూహ్య స్పందన

నైకా, నైకా ఫ్యాషన్‌ను నిర్వహిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ ఐపీఓ ఇవాళ ముగిసింది. ఇన్వెస్టర్ల నుంచి ఈ ఇష్యూకు అనూహ్య స్పందన లభించింది. ఇష్యూ ఏకంగా 82 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. మొత్తం రూ.5,350 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో అక్టోబర్‌ 28న నైకా ఐపీఓ ప్రారంభమైంది. 2.7 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచగా.. 216.6 కోట్ల బిడ్లు (యాంకర్‌ ఇన్వెసర్లు మినహా) దాఖలయ్యాయి. అంటే సుమారు 81.8 రెట్లు అధికంగా ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌ అయిందన్నమాట. రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు గానూ 12.06 రెట్ల స్పందన లభించింది. ఉద్యోగుల వాటాకు కేటాయించిన షేర్లకు 1.87 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యారు. ఒక్కో షేరుకు ₹1085- ₹1125 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ నెల 8న షేర్ల అలాట్‌మెంట్‌ ఉండొచ్చు. 10న షేర్లు డిమ్యాట్‌ ఖాతాలో క్రెడిట్‌అవుతాయి. 11న స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యే అవకాశం ఉంది.