NIFTY TRADE: పెరిగితే అమ్మడమే!
రేపు నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. నిఫ్టికి ఇవాళ, రేపు కీలకం. నెల రోజుల నుంచి పొజిషన్స్ తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు, స్వదేశీ ఆర్థిక సంస్థలు.. వాటిని కొనసాగిస్తాయా లేదా రివర్స్ చేస్తాయా చూడాలి. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ షేర్లను అమ్ముతున్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొనుగోలు చేస్తున్నా… ఐపీఓల నుంచి కొత్త సమస్య ఎదురవుతోంది. అనేక పెద్ద ఇష్యూలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇపుడున్న పోర్టుఫోలియాను తగ్గించి కొత్త షేర్లకు దరఖాస్తు చేయొచ్చు. వీటికి తోడు ఆసియా దేశాల్లో అమ్మకాల ఒత్తిడి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికి వస్తే… నిఫ్టి క్రితం ముగింపు 18268. నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కావొచ్చు. దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు… 18210, 18112 వద్ద లభించవచ్చు. ఈ రెండు స్థాయిలను కోల్పోతే నిఫ్టి 18030కి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టెక్నికల్‌గా నిఫ్టికి ఇక్కడే మద్దతు స్థాయి ఉంది. నిఫ్టి బలహీనంగా ఉంటే దిగువ స్థాయి కోసం వెయిట్ చేయండి. నష్టాల నుంచి కోలుకుంటే క్రితం ముగింపు స్థాయికి రావొచ్చు. చాలా రోజుల తరవాత అన్ని రకాల సాంకేతిక సూచీలు నిఫ్టికి సెల్ సిగ్నల్ ఇస్తున్నారు. సో… అధిక స్థాయిలో అమ్మడం వినా.. దిగువ స్థాయిలో కొనుగోలు చేయొద్దు.