For Money

Business News

ఇంటి రుణం వడ్డీ 6.4 శాతం

కార్పొరేట్‌ రుణాలకు డిమాండ్‌ లేకపోవడంతో అన్ని బ్యాంకులు రీటైల్‌ రుణాల మార్కెట్‌లో చురుగ్గా ఉన్నాయి. రీటైల్‌ మార్కెట్‌లోనూ హౌసింగ్‌ లోన్లపై ప్రతి బ్యాంక్‌ దృష్టి పెట్టింది. బ్యాంకుల మధ్య పోటీ పెరగడంతో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇంటి రుణాలపై వడ్డీని 6.4 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు రేటు రేపటి నుంచి అంటే ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కొత్త రుణాలతో పాటు మిగిలిన ఉన్న బ్యాలెన్స్‌ రుణం బదిలీ కోసం కూడా ఇదే వడ్డీ వసూలు చేస్తామని బ్యాంక్‌ తెలిపింది. అన్ని రకాల కాల పరిమితి ఉన్న రుణాలపై ఈ వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది.