For Money

Business News

IRCTC మరో 10 శాతం డౌన్‌

ఓపెనింగ్‌లోనే ఇన్వెస్టర్లకు నిఫ్టి పెద్ద షాక్‌ ఇచ్చింది. కేవలం 10 నిమిషాల్లో నిఫ్టి 170 పాయింట్లు క్షీణించింది. షార్ట్‌ సెల్లర్స్‌కు కనక వర్షం కురిపింది. గత కొన్ని నెలలుగా ‘బై ఆన్‌ డిప్స్‌’తో నిఫ్టి ఎలా పెరిగిందో… దానికి భిన్నంగా ఇపుడు ట్రేడవుతోంది. ‘సెల్‌ ఆన్‌ రైజ్‌’ పేరుతో పక్కా ఆల్గో లెవల్స్‌కు పరిమితమౌతోంది నిఫ్టి. నిఫ్టి స్వల్ప నష్టాలకు పరిమితం కాగా, మిడ్ క్యాప్‌ షేర్లలో భారీ ఒత్తిడి వస్తోంది. ఈ సూచీ ఓపెనింగ్‌లోనే 1.6 శాతం క్షీణించింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. దీన్ని బట్టి చూస్తే… నిఫ్టి షేర్లను పైస్థాయిలోనే ఉంచి… తరవాతి లెవల్స్‌లో ఉన్న షేర్లలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయన్నమాట. ఐఆర్‌సీటీసీ మళ్ళీ పది శాతం క్షీణించి రూ. 4160 వద్ద ట్రేడవుతోంది. టాటా వపర్‌ కూడా అయిదు శాతం తగ్గింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ 816.05 7.47
యాక్సిస్‌ బ్యాంక్‌ 832.20 1.90
ఓఎన్‌జీసీ 159.75 1.72
ఎం అండ్‌ ఎం 899.25 1.28
ఎల్‌ అండ్‌ టీ 1,801.60 0.52

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 4,896.90 -3.48
ఏషియన్‌ పెయింట్స్‌ 2,902.50 -2.68 ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,164.60 -2.66
కొటక్‌ బ్యాంక్‌ 2,124.00 -2.18
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,170.05 -2.01

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కెనరా బ్యాంక్‌ 203.70 2.57
సన్‌ టీవీ 556.70 1.13
పెట్రోనెట్‌ 231.20 0.63
ఐడియా 10.30 0.49
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా61.10 0.25

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐఆర్‌సీటీసీ 4,160.30 -10.00
కో ఫోర్జ్‌ 5,108.95 -5.35
మణప్పురం 193.30 -3.20
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,277.00 -3.14
L&T టెక్‌ 4,451.25 -2.77