నిమిషాల్లోనే నష్టాల్లోకి నిఫ్టి…
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ప్రారంభమైన నిఫ్టిలో వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కొన్ని నమిషాల్లోనే ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొన్నారు. కేవలం 5 నిమిషాల్లో 120 పాయింట్లు పెరిగి… లాభాలన్నీ కోల్పోయి మళ్ళీ నష్టాల్లోకి జారుకోవడం విచిత్రం. మధ్యలో దిగువస్థాయి నుంచి కోలుకునే ప్రయత్నం చేయేడం విశేషం. ఆరంభంలోనే నిఫ్టి 18,241 పాయింట్లను తాకింది. కొన్ని సెకన్లలోనే 18,139 పాయింట్లకు చేరింది. సెకన్లలో వంద పాయింట్లు పడిందన్నమాట. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 57 పాయింట్ల లాభంతో 18,171 వద్దకు చేరింది. కాని అక్కడ నిలబడలేదు. సరిగ్గా అయిదు నిమిషాల్లో నష్టాల్లోకి చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12 పాయింట్ల నష్టంతో 18,103 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 37 షేర్లు లాభాల్లో ఉన్నా… నామ మాత్రపు లాభాలే. నిఫ్టి భారీ నష్టాల నుంచి బ్యాంకులు కాపాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టి ఒక శాతం లాభంతో ఉంది.