For Money

Business News

బయోకాన్‌ లాభం రూ.138 కోట్లు

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బయోకాన్‌ కంపెనీ రూ.138 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.169 కోట్లు. కంపెనీ ఆదాయం రూ.1,750 కోట్ల నుంచి రూ.1,840 కోట్లకు పెరిగింది. కరోనా ప్రభావం తగ్గడం, సప్లయికి సంబంధించిన ఇబ్బందులు తొలగడంతో ఈఏడాది ద్వితీయార్ధంలో సంస్థ మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు. జెనెటిక్స్‌ బిజినెస్‌ నుంచి టర్నోవర్‌ 12 శాతం తగ్గి రూ. 530 కోట్లకు చేరిందని, అయితే బయోసిమిలర్స్‌ విభాగం నుంచి ఆదాయం పెరిగిందని ఆమె పేర్కొన్నారు.