తొలి ప్రతిఘటన స్థాయి వద్ద నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18,251ని తాకిన నిఫ్టి ఇపుడు 18,227 పాయింట్ల వద్ద 49 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 39 పాయింట్లు గ్రీన్‌లో ఉన్నా… ఇండెక్స్ చాలా స్వల్ప లాభాలతో ఉంది. అంటే అన్నీ నామ మాత్రపు లాభాలే అన్నమాట. వరుసగా రెండో రోజు కూడా ఏషియన్ పెయింట్స్ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా మిడ్ క్యాప్ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి 0.4 శాతం లాభంతో ఉంది. ఇక మిడ్ క్యాప్ షేర్లలో టీవీఎస్ మోటార్ టాప్ గెయినర్‌గా ఉంది. కంపెనీ ఫలితాలు బాగుండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కొత్త అనుబంధ కంపెనీ పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ షేర్ 5 శాతం దాకా పెరిగింది. టాటా వవర్ కూడా గ్రీన్‌లో ఉంది. నిఫ్టి మళ్ళీ 18,250ని దాటుతుందేమో చూడాలి. ఒకవేళ పెరిగితే నిఫ్టిని అధిక స్థాయిలోఅమ్మండి.