For Money

Business News

లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

డాలర్‌ స్వల్ప నష్టాలతో ఉంది. వాల్‌స్ట్రీట్‌లో మూడు సూచీలు లాభాల్లో ఉన్నాయి. నాస్‌డాక్‌ మాత్రం నామమాత్రపు లాభాలతో ట్రేడవుతుండగా… ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ, డౌజోన్స్‌ 0.4 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.హెల్త్‌ రంగ కంపెనీలు ఆకర్షణీయ లాభాలు ప్రకటించడంతో డౌజోన్స్‌ లాభాల్లో ఉంది. ఇవాళ అమెరికా వారాంతపు వీక్లీ క్రూడ్‌ ఆయిల్ నిల్వల డేటా వచ్చింది. అనూహ్యంగా క్రూడ్‌ నిల్వలు తగ్గాయి. దీంతో క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. అధిక స్థాయిలో ఒత్తిడి, చైనా జోక్యంతో ఉదయం నుంచి క్రూడ్‌ వీక్‌గా ఉంది. కాని అమెరికా డేటాతో మళ్ళీ క్రూడ్‌ లాభాల్లో ట్రేడవుతోంది. రాత్రికి 86 డాలర్లు దాటుతుందా అనేది చూడాలి.