బంగారానికి పెరిగిన డిమాండ్..
2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతుల భారీగా పెరిగాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో దిగుమతి పెరిగిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య దిగుమతులు సుమారు 2,400 కోట్ల డాలర్లకు పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో దిగుమతుల విలువ 680 కోట్ల డాలర్లు మాత్రమే. ఈ ఏడాది సెప్టెంబర్ ఒక్క నెలలోనే బంగారం దిగుమతులు 60 కోట్ల డాలర్ల నుంచి 511 కోట్ల డాలర్లకు దూసుకెళ్లాయి. దీంతో కరంట్ ఖాతాలోటు 296 కోట్ల డాలర్ల నుంచి 2260 కోట్ల డాలర్లకు చేరింది.
మరోవైపు వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 61 కోట్ల డాలర్లకు చేరాయి. 2020తో పోలిస్తే 2021లో వెండి దిగుమతులు 92 లక్షల డాలర్ల నుంచి 55 కోట్ల డాలర్లకు పెరిగాయి.