MID SESSION: నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి
ఓపెనింగ్‌లో ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17995ని తాకిన నిఫ్టి… అక్కడ నిలబడలేకపోయింది. 9.30 గంటలకే నష్టాల్లోకి వచ్చిన నిఫ్టి తరవాత కోలుకున్నా.. ఎక్కవ సేపు గ్రీన్‌లో నిలబడలేకపోయింది. మిడ్ సెషన్లో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17864ని తాకింది. ప్రస్తుతం నిఫ్టి 27 పాయింట్ల నష్టంతో 17,918 ప్రాంతంలో ట్రేడవుతోంది. సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా… నామ మాత్రంగానే ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. యూరోస్టాక్స్ 50 సూచీ ఒక శాతం నష్టంతో ఉంది. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ మార్కెట్లు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. డాలర్‌తో పాటు క్రూడ్ ఆయిల్ బలపడుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి గ్రీన్‌లో క్లోజ్ కావడం అనుమానాస్పదంగా ఉంది.