ఎల్‌ఐసీ విలువ రూ. 10 లక్షల కోట్లు!
ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ ఇష్యూను వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా ప్రారంభించాలని యోచిస్తోంది. కనీసం ఈ సంస్థ నుంచి 5 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. అలా అమ్మడం ద్వారా రూ. 60,000 కోట్లు లేదా రూ. 75,000 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వ అంచనా. ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎల్‌ఐసీ ఐపీఓకు లీగల్ అడ్వయిజర్‌గా సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఐపీఓకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను జనవరికల్లా సెబీ వద్ద దాఖలు చేయాలని భావిస్తోంది.