For Money

Business News

నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

సెప్టెంబర్‌లో ఉద్యోగాల కల్పన ఆశించినదానికన్నా తక్కువగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు డల్‌గా ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.3 శాతం క్షీణించగా… డౌజోన్స్‌ మాత్రం నామ మాత్రపు నష్టంతో ట్రేడవుతోంది. డౌజోన్స్‌కు ఎనర్జి షేర్లు అండగా నిలుస్తున్నాయి. డాలర్‌ స్థిరంగా ఉన్నా…క్రూడ్‌ ఆయిల్ ధరలు ఇవాళ కూడా పెరిగాయి. బులియన్‌ ధరల్లో పెద్ద మార్పులు లేవు.