టాటా చేతికి ఎయిర్ ఇండియా
కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా బిడ్లలో టాటా సన్స్ గెలిచినట్లు డీఐపీఏఎమ్ కార్యదర్శి వెల్లడించారు. రెండు బిడ్స్ వచ్చాయని టెక్నికల్‌గా రెండు బిడ్లను ఓకే చేశామని, ఫైనాన్షియల్ బిడ్స్లను కూడా పరిశీలించామని అన్నారు. తొలి బిడ్ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , రెండో బిడ్ అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్టియం అని తెలిపారు. బిడ్లలో టాటా సన్స్ ఎన్నికైందని ఆయన చెప్పారు. రూ. 18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేసింది. బిడ్డింగ్ కోసం టలాస్ అనే పేరుతో టాటా సన్స్ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది.