చివర్లో ఒత్తిడి… నిఫ్టి రికవరైందా?
నిఫ్టి క్రితం ముగింపు పోలిస్తే 144 పాయింట్ల లాభంతో ముగిసింది. ఒకదశలో 17,857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 17,790 వద్ద ముగిసింది. అంటే దాదాపు నిన్నటి నష్టాలు రికవరైనట్లు. అధిక స్థాయిలో అమ్మిన షార్ట్ సెల్లర్స్‌కు స్వల్ప లాభాలు దక్కాయి. నిఫ్టి ఉదయం మాదిరి చివరిదాకా పటిష్ఠంగా నిలబడలేకపోయింది. వీక్లీ డెరివేటివిక్స్ కారణంగా చివర్లలో లాభాల స్వీకరణ వచ్చింది. అయితే ఇవాళ సూపర్ ట్రేడింగ్ మిడ్ క్యాప్స్‌లో జరిగింది. మిడ్ క్యాప్ నిఫ్టి ఏకంగా 2.3 శాతం లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టి కూడా పరవాలేదు. అరశాతంపైనే లాభపడింది. ఉదయం నుంచి నిఫ్టిలో టైటాన్, టాటా మోటార్స్ పోటీ పడి పెరిగాయి. ఇక మిడ్ క్యాప్ నిఫ్టిలో గోద్రెజ్ ప్రాపర్టీస్, పేజ్ ఇండస్ట్రీస్ దుమ్ము రేపాయి.