17,850 పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి 17850పైన ప్రారంభమైంది. 17,879ని తాకిన తరవాత ఇపుడు 45 పాయింట్ల లాభంతో 17867 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్ క్యాప్ నిఫ్టి కూడా దాదాపు అర శాతం లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి లాభం 0.3 శాతానికి పరిమితమైంది. ఇవాళ కూడా ఓఎన్జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది. క్రూడ్ ఆయిల్లో వస్తున్న నాన్ స్టాప్ ర్యాలీతో ఈ కౌంటర్లో ఆసక్తి కన్పిస్తోంది. మళ్ళీ నిఫ్టి కనుక 17900 ప్రాంతానికి వస్తే డే ట్రేడింగ్ కోసం స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చని టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇవాళ లాభాలు వస్తాయా అన్నది చూడాలి.