For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులు పడుతూ వస్తున్న వాల్‌స్ట్రీక్‌కు నిన్న పెద్ద రిలీఫ్‌ అని చెప్పొచ్చు. అన్ని సూచీలు ఒక శాతం పెరగడం విశేషం. గత నష్టాలతో పోలిస్తే తక్కువైనా.. కాస్త రిలీఫ్‌ అని చెప్పొచ్చు. డాలర్ ఇండెక్స్‌ ఎట్టకేలకు 94ను దాటింది. కాని క్రూడ్‌ ధరల్లో పెద్ద మార్పు లేదు. బులియన్‌లోనూ నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లలో ర్యాలీని ఆసియా మార్కెట్లు పట్టించుకోలేదు. నిన్న మూడు శాతం పడిన జపాన్‌ నిక్కీ ఇవాళ మరో 0.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లకు ఇవాళ సెలవు. ఇక హాంగ్‌కాంగ్‌ మార్కెట్లలో కూడా పతనం కొనసాగుతోంది. హాంగ్‌సెంగ్‌ ఇపుడు 1.25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిక్కీ, హాంగ్‌సెంగ్‌ భారీగా నష్టపోయాయి. సింగపూర్‌ నిఫ్టి కూడా స్థిరంగా ఉంది. పెద్ద నష్టాలు లేవు. మరి ఈనేపథ్యంలో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమౌతాయా లేదా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తారా అన్నది చూడాలి.