పండోరా పేపర్స్‌లో జాకీ ష్రాఫ్
ఈసారి ఆశ్చర్యకరంగా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ పేరు పండోరా పేపర్స్‌లో బయటపడింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టి గేటివ్ జర్నలిస్ట్స్ (ICIJ) నిన్న రాత్రి విదేశాల్లో భారీ ఎత్తున నిధులు తరలించిన భారత్‌కు చెందిన 380 మంది పారిశ్రామికవేత్తలు/కంపెనీల పేర్లను బయటపెట్టింది. వీటిని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ప్రచురిస్తోంది. జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్ తల్లి బెల్జియం దేశస్థురాలు. ఆమె పేరు క్లాడియా దత్. ఆమె న్యూజిల్యాండ్‌లో మీడియా అనే సంస్థను ప్రారంభించింది. న్యూజిల్యాండ్‌లోని లండన్ పిడ్యూసరీ ట్రస్ట్ కంపెనీ వద్ద ఈ ట్రస్ట్‌ను ఆమె రిజిస్టర్ చేశారు. దీనికి నిధులు జాకీ ష్రాఫ్ నుంచివస్తాయని పేర్కొంది. ఈ ట్రస్ట్ అంతి లబ్దిదారులు జాకీ ష్రాఫ్ పిల్లలు జై ష్రాఫ్ (టైగర్ ష్రాఫ్), కృష్ణ ష్రాఫ్. విచిత్రమేమిటంటే న్యూజిల్యాండ్‌కు చెందిన ఈ కంపెనీ అంతి లబ్దిదారు కంపెనీ బ్రిటీష్వర్జిన్ ఐల్యాండ్స్‌లో ఉండగా, దీని బ్యాంకు ఖాతాలు స్విస్‌లో ఉండటం. 2005 నవంబర్ 29న ప్రారంభించిన ఈ ట్రస్ట్‌ను 2013 సెప్టెంబర్‌లో మూసేశారు. దీనికి సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఈ సంస్థ గురించి ఆయేషాను సంప్రదించింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. ఇలాంటి ట్రస్ట్ ఉందన్న విషయం తనకు గాని, తన కుంటుంబ సభ్యులకుగాని తెలియదని ఆమె అన్నారు. ఈ ట్రస్ట్ నెలకొల్పిన తన తల్లి పదేళ్ళ క్రితమే మరణించారని ఆయేషా పేర్కొంది. తన తల్లి బెల్జియం దేశస్థురాలని, భారత పౌరసత్వం లేదని ఆమె పేర్కొంది.
image courtesy: indianexpress