For Money

Business News

దివాలా తీశానన్నాడు… వెయ్యి కోట్లు దాచాడు

తమకు ఇవ్వాల్సిన రుణాలను ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ ఇవ్వడం లేదని బ్రిటన్‌ కోర్టులో కేసు వేశాయి చైనా బ్యాంకులు. తాను పూర్తిగా దివాలా తీశానని, రోజువారీ ఖర్చుల కోసం భార్యపై ఆధారపడ్డానని కోర్టుకు తెలిపారు అనిల్‌ అంబానీ. కాని ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ICIJ) ఇటీవల జరిపిన పరిశోధనల్లో అనిల్‌ అంబానీ వందల కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలు ఉంచినట్లు తేలింది. పండోరా పేపర్స్‌ పేరుతో రాత్రి ఆ సంస్థ లీక్‌ చేసిన డాక్యుమెంట్లను మన దేశంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ బయటపెట్టింది. నల్లధనం దాచుకోవడానికి స్వర్గధామాలైన బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌, సైప్రస్‌లలో అనిల్‌ అంబానీ ఏకంగా 18 కంపెనీలు ప్రారంభించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. 2007 నుంచి 2010 మధ్యకాలంలో ఈ కంపెనీలను అనిల్‌ అంబానీ ప్రారంభించారు. ఈ కంపెనీలు భారీ మొత్తంలో రుణం తీసుకుని… ఇతర కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయి. ఈ మొత్తం రూ. 1,000 కోట్ల దాకా ఉంటుందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తేల్చింది. 2007 నుంచి 2008 మధ్య కాలంలో బటిస్టే అన్‌ లిమిటెడ్‌, రేడియం అన్‌ లిమిటెడ్‌, హూయీ ఇన్వెస్ట్‌మెంట్‌ అన్‌ లిమిటెడ్‌ కంపెనీలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇందులో మొదటి రెండు కంపెనీలు అనిల్ అంబానీ హోల్డింగ్‌ కంపెనీ అయిన రిలయన్స్‌ ఇన్నోవెంచర్స్‌కు చెందినవని పేర్కొంది. మరో కంపెనీని రిలయన్స్‌ క్యాపిటల్‌ ప్రారంభించినట్లు పేర్కొంది. అనిల్‌ అంబానీ విదేశీ కంపెనీల కీలక లావాదేవీలను కూడా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. దీనిపై రిలయన్స్‌ లాయర్ మాట్లాడుతూ… తన క్లయింటు పెట్టుబడులన్నీ సక్రమేనని చెప్పారు.