NIFTY TRADE: పెరిగితే అమ్మండి
చైనాలో రియాల్టి సంక్షోభం తీవ్రమౌతోంది. బాండ్లపై వడ్డీని చెల్లించకపోవడంతో చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్‌గ్రాండే కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను హాంగ్‌సెంగ్ నిషేధించింది. చైనా మార్కెట్లకు సెలవు. జపాన్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉంది. అమెరికా ఫ్యూచర్స్ కూడా 0.4 శాతం వరకు నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,532.నిఫ్టికి ఇది కీలక స్థాయి. ఇక్కడి నుంచి పెరిగితే 17600 ప్రాంతంలో నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. 17640 దాటితే గాని నిఫ్టి బ్రేకౌట్ కష్టం. సో.. స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో 17600 ప్రాంతంలో నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్ తీసుకునేవారు అంతకన్నా ముందు అమ్మొచ్చు. నిఫ్టి క్రితం ముగింపుకన్నా దిగువకు వస్తే 17,470 ప్రాంతంలో మద్దతు వస్తుందేమో చూడండి. వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే 17450-17430 స్థాయి దిగువకు వస్తే అమ్మకాల ఒత్తిడి మరింత అధికమౌతుంది. ఈ ప్రాంతానికి వస్తే స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. 17420 దిగువన మాత్రం కొనుగోలు చేయొద్దు.