For Money

Business News

కోలుకున్న వాల్‌స్ట్రీట్‌

భారీ నష్టాల తరవాత వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కోలుకుంది. ముఖ్యంగా డాలర్‌ భారీగా పెరిగిన నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌కు నామ మాత్రపు లాభాలు రావడం గొప్పే. నాస్‌డాక్‌ ఇప్పటికీ కేవలం నామ మాత్రపు లాభాలతో అంటే 0.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. మరి చివరికి వరకు ఇవే లాభాలు ఉంటాయా లేదా మళ్ళీ నష్టాల్లోకి వెళుతుందా అనేది చూడాలి. ఇక ఎస్‌ అండ్‌ పీ 500, డౌజోన్స్‌ సూచీలు అర శాతం లాభాలతో ఉన్నాయి. ఈ లాభాలు కూడా చివరిదాకా ఉంటాయా అన్నది అనుమానమే. యూరో మార్కెట్లు దాదాపు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నా.. అమెరికా మార్కెట్ల పరిస్థితి అయోమయంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ల లాభాలు నిలబడుతాయా అన్నది చూడాలి.