For Money

Business News

ABSL AMC ఐపీఓ: దరఖాస్తు చేశారా?

మరో ఆకర్షణీయ ఇష్యూ ఇవాళ మార్కెట్‌లో ప్రవేశించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభమైంది. ఎల్లుండి క్లోజ్‌ కానుంది. షేర్‌ ముఖ విలువ రూ. 5 కాగా, ఇష్యూ ధర శ్రేణి రూ. 695-రూ. 712. గరిష్ఠ ధరకే ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్లు జరిగాయి. కాబట్టి ఈ ధరకు ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కనీసం 20 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ ఇది. ఈ ఆఫర్‌ కింద కొత్త షేర్లను ఆఫర్‌ చేయడం లేదు. ఇన్వెస్టర్లు తమ వాటాను విక్రయిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ 28 లక్షల షేర్లను అమ్ముతుండగా, సన్‌ లైఫ్‌ ఏఎంసీ 3.6 కోట్ల షేర్లను అమ్మేస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 2726 కోట్లు సమీకరించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. షేర్ల అలాట్‌మెంట్‌ అక్టోబర్‌ 6న జరుగుతుంది. 11వ తేదీన లిస్ట్‌ అయ్యే అవకాశముంది. ఇతర కంపెనీలతో పోలిస్తే… ఇష్యూ ఆకర్షణీయ ధరకు వస్తోందని దరఖాస్తు చేయడం మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.