For Money

Business News

ఐటీ షేర్లలో ‘రక్తపాతం’

కరోనా కాలంలో కాలంతో పోటీ పడి పెరిగిన ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్ల ధరలు ఐస్‌లా కరిగిపోతున్నాయి. రోజుకు పది శాతం చొప్పున షేర్లు ధరలు తగ్గుతున్నాయంటే… ఒత్తిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రధాన ఐటీ షేర్లలో కూడా వరుస అమ్మకాలు వస్తున్నాయి.మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఫార్మాలోనూ అమ్మకాలు ఉన్నా… స్వల్ప స్థాయిలో ఉన్నాయి. కేవలం ప్రభుత్వ రంగ షేర్ల అండతో సూచీలు పడకుండా కాపాడుతున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
మారుతీ 7,345.05 5.65 ఎన్‌టీపీసీ 130.95 5.39
ఐఓసీ 122.80 4.73
కోల్ ఇండియా 173.80 4.64
పవర్‌ గ్రిడ్‌ 184.25 4.60

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టెక్‌ మహీంద్రా 1,394.75 -7.92
హెచ్‌సీఎల్ టెక్‌ 1,263.05 -7.01
దివీస్‌ ల్యాబ్‌ 4,769.00 -6.65
విప్రో 632.10 -6.56
బజాజ్‌ ఫిన్‌ 17,439.90 -5.86

నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌
భెల్ 60.50 7.56 పీఎఫ్‌సీ 142.00 5.07
ఏయూ బ్యాంక్‌ 1,119.00 4.41
ఆర్‌ఈసీ 158.30 3.74
ఐఆర్‌సీటీసీ 3,822.80 3.62

నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ లూజర్స్‌
మైండ్‌ ట్రీ 4,164.00 -9.50
కోఫోర్జ్‌ 5,134.75 -9.10
చోళ మండలం 547.80 -4.91
ఐడియా 10.95 -4.78
SR ట్రాన్స్‌ ఫైనాన్స్‌ 1,290.90 -4.78