భారీ నష్టాలతో నిఫ్టి ఓపెన్
ఊహించినట్లే నిఫ్టి వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,613 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 114 పాయింట్ల నష్టంతో 17,634 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్స్ సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టి 0.7 శాతం నష్టంతో ఉంది. ఐటీ, ఫార్మా షేర్లలో ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. టెక్ మహీంద్రా 7 శాతంపైగా నష్టపోయింది. అలాగే దివీస్ ల్యాబ్ కూడా ఆరు శాతంపైగా నష్టపోవడం విశేషం. కరోనా సమయంలో అదేపనిగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జోరుగా ఉంది. ఇవాళ కూడా ప్రభుత్వ రంగ షేర్లు నిఫ్టిని కాపుడుతున్నాయి. కరోనా సమయంలో డీలా పడిన మారుతీ షేర్ ఇపుడు జెట్ స్పీడుతో పెరుగుతోంది. ఇవాళ ఆరు శాతం లాభంతో దూసుకుపోతోంది. నిఫ్టి ఇక్కడి నుంచి ఏమాత్రం పెరిగినా.. అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. యూరో మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగే పక్షంలో… నిఫ్టి మరింత క్షీణించే అవకాశముంది.