NIFTY TRADE: అమ్మినవాడు ధన్యుడు
స్టాక్ మార్కెట్ పతనం చాలా స్పీడుగా ఉంటోంది. వరుసగా నోట్ల ప్రింట్ చేస్తూ వచ్చిన అమెరికా కేంద్ర బ్యాంక్ కూడా అలసిపోయింది. మార్కెట్లో వొద్దన్నా డాలర్లను కుమ్మరించారు. ఇపుడు పరిస్థితి మారుతోంది. బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు కచ్చితంగా పెరిగే ఛాన్స్ కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా షేర్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి ఇవాళ కూడా కనీసం వంద పాయింట్ల నష్టంతో ప్రారంభం కావొచ్చు. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్లో రూ. 1,958 కోట్ల విలువైన షేర్లను అమ్మగా… దేశీ ఆర్థిక సంస్థలు రూ. 161 కోట్ల విలువైన షేర్లను మాత్రమే కొన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 17,841. నిన్న నిఫ్టి 17,576 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. యూరో మార్కెట్లను చూసి మన మార్కెట్లు కోలుకున్నా… నిన్న యూరో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కాబట్టి ఇవాళ నిఫ్టి కనీసం 100 పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. నిఫ్టి గనుక 17,745 దిగువకు వెళితే వెయిట్ చేయండి. ఎందుకంటే నిఫ్టికి 17,640 వరకు మద్దతు లేదు. అక్కడ కూడా గట్టిగా నిలబడితేనే. నిఫ్టి 50 రోజుల చలన సగటు (DMA) 17,500. ఈ స్థాయిని నిఫ్టి తాకుందని టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.మరి ఈ స్థాయికి నిఫ్టి ఇవాళే చేరుతుందా… లేదా కొన్ని రోజులు తీసుకుంటుందా అన్నది చూడాలి. నిఫ్టి గనుక 17,600 స్థాయిని బ్రేక్ చేస్తే..17,545కి చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ స్థాయిని బ్రేక్ చేస్తే… అంటే 50 రోజుల చలన సగటుకు దిగువకు వస్తే 17,400వరకు మద్దతు లేదు. మార్కెట్లో ప్రవేశించాలనుకునేవారు నిఫ్టి లెవల్స్ గమనిస్తూ ఉండండి.